నేపాల్‌ విమాన ప్రమాదం..22 మృతదేహాలు వెలికితీత

న్యూఢిల్లీ : విమాన ప్రమాదంలో 22 మృతదేహాలను వెలికి తీసినట్లు నేపాల్‌ ఆర్మీ తెలిపింది. తారా ఎయిర్‌లైన్‌కు చెందిన విమానం 22 మంది ప్రయాణికులతో వెళ్తున్న సమయంలో ఈ నెల 29న కూలిపోయిన విషయం తెలిసిందే. ఫొఖారా నుంచి హిమాలయాల్లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన జామ్సన్‌కు వెళ్తున్న సమయంలో ఘటన చోటు చేసుకున్నది. ఫొఖారా నుంచి ఉదయం 10.15 గంటలకు బయలుదేరగా.. 15 నిమిషాల తర్వాత కంట్రోల్‌ సెంటర్‌తో సంబంధాలు తెగిపోయాయని ఎయిర్‌లైన్‌ ప్రతినిధి తెలిపారు. ఆ తర్వాత విమానంలో నలుగురు భారతీయులు, ఇద్దరు జర్మనీ వాసులు, 13 మంది నేపాల్‌ పౌరులు, మరో ముగ్గురు సిబ్బంది ఆచూకీ తెలియకుండా పోయింది.

మరుసటి రోజు పైలట్‌ మొబైల్‌ ఫోన్‌ ఆధారంగా ట్రాక్‌ చేసి, విమానం కూలిపోయినట్లు నేపాల్‌ ఆర్మీ ధ్రువీకరించింది. ముస్తాంగ్‌ జిల్లాలో విమానం కూలిపోగా.. సోమవారం వరకు 21 మృతదేహాలను వెలికి తీయగా.. మంగళవారం మరో మృతదేహాన్ని వెలికితీసినట్లు నేపాల్‌ అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో నలుగురు భారతీయులు సహా ఇద్దరు జర్మనీ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఏవియేషన్‌నేపాల్‌ కెనడియన్‌ విమానాల తయారీ కంపెనీ హావిల్లాండ్‌ తయారు చేసిన ఈ విమానం సుమారు 50 సంవత్సరాలుగా నేపాల్‌లో సేవలందిస్తున్నది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/