ఏడాదిన్నర తర్వాత చైనాలో అడ్డుగుపెట్టిన జాక్‌ మా

Alibaba shares rise as founder Jack Ma returns to China after year-long absence

బీజింగ్ః అలీబాబా వ్యవ‌స్థాప‌కుడు , చైనా కుబేరుడు జాక్‌ మా చాలా కాలం తర్వాత స్వదేశంలో అడుగుపెట్టారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఆగ్రహానికి గురై దాదాపు ఏడాదిన్నరగా విదేశాల్లో గడిపిన ఆయన.. ఎట్టకేలకు చైనాలో ప్రత్యక్షమయ్యారు. ఈ విషయాన్ని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ సోమవారం నివేదించింది. యాంట్ గ్రూప్ జాక్ మా మళ్లీ చైనాలో అడుగుపెట్టారని పేర్కొంది. అయితే, చైనాలో అడుగుపెట్టగానే హాంగ్‌జోయ్‌ లో తాను స్థాపించిన స్కూల్‌కే జాక్‌మా మొదటగా వెళ్లినట్లు మార్నింగ్‌ పోస్ట్‌ తెలిపింది. అక్కడ విద్యార్థులతో జాక్‌మా కాసేపు ముచ్చటించినట్లు పేర్కొంది. అనంతరం చైనా చేరుకున్నట్లు వెల్లడించింది.

అలీబాబా గ్రూప్‌ను స్థాపించి అపరకుబేరుడిగా ఎదిగిన జాక్‌మా.. 2020 చివరిలో అక్కడి ప్రభుత్వాన్ని బహిరంగంగా విమర్శించి చిక్కుల్లో పడ్డారు. ఓ పబ్లిక్‌ మీటింగ్‌లో మాట్లాడుతూ చైనా రెగ్యులేటరీ సిస్టంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత చైనా అధికారులు జాక్‌మాకు చెందిన కంపెనీలపై వరుసగా దాడులు చేశాయి. ఆర్థిక పరంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయి. ప్రభుత్వ ఆగ్రహంతో అలీబాబా, యాంట్‌ గ్రూప్‌ తీవ్రంగా నష్టపోయాయి.