అలియా భట్ పుట్టినరోజు కానుకగా ‘బ్రహ్మాస్త్ర’ ఫస్ట్ లుక్

సోషియో ఫాంటసీ అడ్వెంచర్ మూవీలో పవర్ ఫుల్ పాత్ర

Aliabhatt- powerful role in 'Brahmastra'
Aliabhatt- powerful role in ‘Brahmastra’

బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రాల్లో ‘బ్రహ్మాస్త్ర’ కూడా వుంది. రణబీర్ కపూర్ , అలియా భట్ ,అమితాబ్ బచ్చన్ ,మౌనీరాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సోషియో ఫాంటసీ అడ్వెంచర్ మూవీ రాబోతుంది. ‘కింగ్ ‘అక్కినేని నాగార్జున చాలా గ్యాప్ తర్వాత ఈ చిత్రంతో బాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ ‘బ్రహ్మాస్త్ర’ చిత్రాన్ని మూడు భాగాలుగా విడుదల చేయనున్నారు.

YouTube video

”బ్రహ్మాస్త్ర ఫస్ట్ పార్ట్: శివ” పేరుతో మొదటి భాగాన్ని విడుదల చేయనున్నారు. మంగళవారం హీరోయిన్ అలియా భట్ పుట్టినరోజు సందర్భంగా యూనిట్ శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె పాత్రను పరిచయం చేయడంతో పాటుగా విజువల్స్ తో కూడిన ఫస్ట్ లుక్ ని రివీల్ చేసారు. ఈ సందర్భంగా నాగార్జున ట్వీట్ చేస్తూ.. ‘బ్రహ్మాస్త్ర మొట్టమొదటి విజువల్స్ తో ఆలియా లుక్ ని షేర్ చేస్తున్నందుకు సంతోషిస్తున్నాను. ఆమె ఎల్లప్పుడూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని రాసుకొచ్చారు. ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో ఈషా పాత్రలో అలియా కనిపించనుందని.. బ్రహ్మాస్త్ర శక్తి అని మేకర్స్ పేర్కొన్నారు. విజువల్ వండర్ గా ఉన్న ఈ వీడియోలో అలియా ఎంతో అందంగా కనిపిస్తోంది. సూపర్ నేచురల్ పవర్స్ కలిగియున్న రణబీర్ తో పాటుగా ఆమె పాత్ర కూడా కథలో కీలకమని అర్థమవుతోంది.

ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సమర్పణలో ధర్మ ప్రొడక్షన్స్ – ప్రైమ్ ఫోకస్ బ్యానర్స్ పై భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని తెలుగులో రాజమౌళి సెప్టెంబర్ 9న రిలీజ్ చేయనున్నారు.

అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/