దేశ రాజధాని నుండి జైపూర్ మధ్య హైవేను నిర్మించడం నా కల : మంత్రి గడ్కరీ

న్యూఢిల్లీ : కేంద్ర రోడ్డు, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ నేడు ఢిల్లీలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. దేశ రాజధాని ఢిల్లీ, జైపూర్ మధ్య తొలి ఎలక్ట్రిక్ హైవేను నిర్మించడం తన కల అని అన్నారు. మణిపూర్, సిక్కిం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్‌లో రోప్‌వే కేబుల్స్‌ను ఏర్పాటు చేసేందుకు 47 ప్రతిపాదనలు వచ్చినట్లు ఆయన చెప్పారు. కానీ ఢిల్లీ, జైపూర్ మధ్య ఎలక్ట్రిక్ హైవేను ఏర్పాటు చేయడం తన కల అన్నారు. రోడ్డు, రహదారుల శాఖకు మంచి బడ్జెట్ ఉందని, మార్కెట్ కూడా సపోర్ట్ చేస్తోందన్నారు. 2022-23 సంవత్సరానికి రోడ్ల శాఖకు 1.99 లక్షల కోట్లు కేటాయించినట్లు ఆయన చెప్పారు. దీంట్లో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకు 1.34 లక్షల కోట్లు ఇవ్వనున్నట్లు చెప్పారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/business/