డబ్బు, రాజకీయాలపై వున్న సోయి.. కేసీఆర్ కు రైతులపై లేదు – కోమటి రెడ్డి

డబ్బు, రాజకీయాలపై వున్న సోయి.. కేసీఆర్ కు రైతులపై లేదు - కోమటి రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో… ధాన్యం కొనుగోలు అంశంపై కాంగ్రెస్ పార్టీ శనివారం ఇందిరా పార్క్ దగ్గర వరి దీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ దీక్షకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా హాజరయ్యారు. ముఖ్యంగా ఈ దీక్ష కు కోమటి రెడ్డి వెంకటరెడ్డి హాజరవ్వడం ..రేవంత్ తో సన్నిహితంగా ఉండడం అందర్నీ ఆకట్టుకుంది.

ఇక దీక్షలో కోమటిరెడ్డి మాట్లాడుతూ..కేసీఆర్ ఫై ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బు, రాజకీయాలపై వున్న సోయి.. కేసీఆర్ కు రైతులపై లేదని మండిపడ్డారు. హుజురాబాద్ లో దళిత బంధు ఓ లెక్కనా అన్న కేసీఆర్.. రైతులకు వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు ఇచ్చుడే మరిచిండు అని అన్నారు. చంద్రబాబు.. కరెంట్ తీగల పై బట్టలు ఆరేసుకోవాలని అంటే..వైఎస్ఆర్ వచ్చాక ఉచిత కరెంట్ ఇచ్చారని తెలిపారు.

మేడ్చల్ మీటింగ్ లో తెలంగాణ ప్రజలు బాగుపడలేదని సోనియా ఆవేదన వ్యక్తం చేశారని.. కానీ కేసీఆర్ కుటుంబమే బాగుపడిందని చెప్పారు. దళితులకు.. 3 ఎకరాల భూమి, దళిత సీఎం అని చెప్పి.. నేనెందుకు అన్నా అని అంటున్నాడని అన్నారు. కెసిఆర్ జోకర్ లాంటి రాజకీయ నాయకుడన్నారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. తెలంగాణ కోసం సొంత పార్టీ నేతలను కూడా బెదిరించి తెస్తే.. కేసీఆర్ ఆగం చేస్తుండన్నారు. అన్నం పెట్టే అన్నదాత పాసిపోయిన అన్నం తింటున్నాడని చెప్పారు. నిరుద్యోగ యువత జాబ్స్ లేక చనిపోతున్నారని అన్నారు.