పూజతో మొదలెట్టిన ఏజెంట్.. ఈసారైనా..?

పూజతో మొదలెట్టిన ఏజెంట్.. ఈసారైనా..?

టాలీవుడ్ యంగ్ హీరో, అక్కినేని వారసుడు అఖిల్ కెరీర్ మొదట్నుండీ మంచి విజయాన్ని అందుకోవాలనే ఉద్దేశ్యంతో వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అయితే ఆయనకు అదిరిపోయే సక్సెస్ మాత్రం ఇంకా తగల్లేదు. దీంతో తన తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రంతో ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకోవాలని ఆయన చూస్తున్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే, తన నెక్ట్స్ చిత్రాన్ని తాజాగా ప్రారంభించాడు అఖల్.

మాస్ చిత్రాల దర్శకుడు సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో అఖిల్ తన నెక్ట్స్ మూవీని చేయబోతున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేశాడు. కాగా తాజాగా అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రారంభించారు చిత్ర యూనిట్. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను చిత్ర యూనిట్ తాజాగా జరుపుకుంది. ఈ కార్యక్రమంలో అక్కినేని నాగార్జున, అమలా అతిథులుగా హాజరుకాగా, నాగార్జున మొదటి షాట్‌కు క్లాప్ కొట్టగా, అమలా కెమెరా స్విచాన్ చేశారు. ఈ సినిమాకు ఏజెంట్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేశారు.

ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ఈ నెల 11 నుండి నిర్విరామంగా జరుపుకోవాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. కాగా ఈ సినిమాను డిసెంబర్ 24న రిలీజ్ చేసేందుకు సురేందర్ రెడ్డి అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తోంది.