రామబాణం నుండి నువ్వే నువ్వే సాంగ్ రిలీజ్

లక్ష్యం, లౌక్యం లాంటి రెండు హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీవాస్ డైరెక్షన్లో గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ రామబాణం. మే 05 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలను స్పీడ్ చేసారు. ఇప్పటికే పలు స్టిల్స్ రిలీజ్ చేసిన మేకర్స్..సోమవారం ‘నువ్వే నువ్వే’ అంటూ సాగే ఒక లిరికల్ వీడియో సాంగును రిలీజ్ చేశారు. ‘మొదటిసారిగా మనసుపడి .. వదలకుండ నీ వెంటపడి .. మొదలైంది నా గుండెల్లో లవ్ మెలోడీ’ అంటూ ఈ పాట మొదలవుతోంది. గోపీచంద్ – డింపుల్ హయతిపై ఈ పాటను విదేశాల్లో చిత్రీకరించారు. మిక్కీ జె మేయర్ స్వరపరిచిన ఈ పాటకి శ్రీమణి సాహిత్యాన్ని అందించగా, రితేశ్ ఆలపించాడు. దినేశ్ కుమార్ కొరియోగ్రఫీని అందించాడు.

ఈ చిత్రంలో ఖుష్బూ సుందర్‌, జగపతిబాబు, సచిన్ ఖేడ్కర్‌, నాజర్‌, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిశోర్‌, సప్తగిరి, కాశీ విశ్వనాథ్‌, సత్య, గెటప్‌ శ్రీను, సమీర్‌, తరుణ్ అరోరా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డింపుల్ హయతి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు.

YouTube video