ఘనంగా ముగిసిన సూపర్ స్టార్ కృష్ణ దశదిన కార్యక్రమం

సూపర్ స్టార్ కృష్ణ దశదిన కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. ఈ కార్య క్రమానికి కృష్ణ కుటుంబ సభ్యులు, సినీ , రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. హార్ట్ ఎటాక్ తో సూపర్ స్టార్ కృష్ణ నవంబరు 15న కన్నుమూసిన సంగతి తెలిసిందే. కృష్ణ కన్నుమూశారనే వార్త తెలిసి యావత్ చిత్రసీమ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. కడసారి ఆయన్ను చూసేందుకు సినీ , రాజకీయ ప్రముఖులు , అభిమానులు పోటీపడ్డారు. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిగాయి.

నేడు కృష్ణ దశదిన కర్మ కార్యక్రమం హైదరాబాదులో ఘనంగా జరిగింది. దశదిన కార్యక్రమం సందర్భంగా భారీ భోజన ఏర్పాట్లు చేశారు. సినీ, రాజకీయ ప్రముఖుల కోసం ఎన్ కన్వెన్షన్ లో, అభిమానుల కోసం జేఆర్సీ కన్వెన్షన్ లో విందు ఏర్పాటు చేశారు. అభిమానుల కోసం 5 వేల పాసులు అందించారు. ఈ కార్యక్రమంలో మహేశ్ బాబు మాట్లాడుతూ.. “మా నాన్న గారు నాకు ఎన్నో ఇచ్చారు… ఆయన ఇచ్చిన వాటిలో అన్నింటికన్నా గొప్పది… మీ అభిమానం. అందుకు ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. నాన్న గారు ఎప్పటికీ నా హృదయంలో, మీ హృదయాల్లో నిలిచే ఉంటారు. ఆయన ఎప్పటికీ మన మధ్యే ఉంటారు. అభిమానుల్ని కలుసుకోవడం ఆనందం కలిగిస్తోంది. నాపై మీ అభిమానం, మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటాను” అంటూ ఎమోషనల్ గా మాట్లాడారు.