ప్రయాణికులకు షాక్‌ ఇచ్చిన ఎయిర్‌లైన్‌ సంస్థలు!

ముందుగా బుక్‌ చేసుకున్న వారికి డబ్బు రీఫండ్‌ ఇచ్చే అవకాశం లేదు!

Airlines

దిల్లీ: దేశంలో మే నెల 3 వ తేది వరకు లాక్‌డౌన్‌ ను పొడగించారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల 3 వ తేది వరకు టికెట్‌లు బుక్‌ చేసుకున్న వారికి ఎయిర్‌లైన్స్‌ సంస్థలు షాక్‌ ఇచ్చాయి. విమానాలు రద్దు అయినా వారికి డబ్బులు రీఫండ్‌ చేయకూడదని నిర్ణయించాయి. రిజర్వ్‌ చేసుకున్న వారు లాక్‌డౌన్‌ తరువాత మరో తారీఖులో ప్రయాణాలను రీషెడ్యుల్‌ చేసుకోవాలని సూచిస్తున్నాయి. రీ బుకింగ్‌ చేసుకునే సమయంలో చార్జీలు పెరిగితే ఆ తేడాను చెల్లించాల్సిందేనని పెర్కోంటున్నాయి. అయితే ఎయిర్‌ లైన్స్‌ సంస్థల వైఖరిపై సీఏపీఏ( సెంటర్‌ ఫర్‌ పసిఫిక్‌ ఏవియేషన్‌) అసంతృప్తిని వ్యక్త చేసింది. ఎయిర్‌లైన్స్‌ సంస్థలు తమ నిర్ణయాల పట్ల మరోసారి రివ్యూ చేసుకోవాలని కోరింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/