వందేళ్లలోనే అతిపెద్ద ఆర్ధిక మాంద్యం!
ప్రపంచానికి 9 ట్రిలియన్ డాలర్లు నష్టం!

నూయార్క్: ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ కరోనా కారణంగా గడిచిన వంద ఏళ్లలో ఎన్నడు లేనంతగా మాద్యంలోకి కూరుకుపోనుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) అంచనా వేసింది.
ప్రపంచ జీడిపి ఇప్పటికే 3 శాతానికి పడిపోయిందని, దీని కారణంగా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ 9 ట్రిలియన్ డాలర్లు నష్టపోనుందని ఐఎంఎఫ్ చీఫ్ ఎకానమిస్ట్ గీతా గోపినాథ్ అంచనా వేశారు. తాజా అంచనాలను మీడియాకు విడుదల చేశారు.
ప్రపంచంలో ఈ వైరస్ కారణంగా2020, 2021 లో ఏర్పడే నష్టం జపాన్,జర్మని దేశాల ఆర్ధిక వ్యవస్థలను కలిపితే వచ్చే మొత్తానికన్నా అధికమని పేర్కోంది. ప్రస్తుతం కరోనా కారణంగా ప్రపంచదేశాలు షట్‌డౌన్ అయ్యాయి. ప్రపంచదేశాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇది మరింత కాలం కొనసాగితే బారీ నష్టం జరుగుతుందని, చాలి కంపెనీలు మూత పడతాయని, నిరుదోగ సమస్య ఆకాశానికి ఎగబాకుతుందని తెలిపింది.
వైరస్ పూర్తిగా అదుపులోకి వచ్చినా 2021 లో 5.8 శాతం వృద్ది నమోదు కావచ్చని అంచనా వేశారు. కాని ఇది ఖచ్చితత్వం కాదని అన్నారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితిని ది గ్రేట్ లాక్‌డౌన్ గా అభివర్ణించింది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/