హాంకాంగ్‌లో విమానాలు రద్దు చేసిన ఎయిర్‌ ఇండియా

న్యూఢిల్లీ: కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో చైనాలోని హాంకాంగ్‌లో ఎయిర్‌ ఇండియా విమాన సర్వీసులను రద్దు చేసింది. ఈ నెల 19 నుంచి 23 వరకు విమానాలను నడపడం లేదని స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తిని నిలువరించడానికి అధికారులు కరోనా ఆంక్షలు విధించారు. దీంతోపాటు డిమాండ్‌ కూడా తక్కువగా ఉన్నదని ఈ నేపథ్యంలో విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఎయిర్‌ ఇండియా అధికారులు ప్రకటించారు.

భారత్‌ నుంచి హాంకాంగ్‌ రావాలనుకునేవారు 48 గంటల ముందే పరీక్షలు చేయించుకోవాలని, నెగెటివ్‌ రిపోర్ట్‌ తప్పనిసరని అధికారులు స్పష్టం చేశారు. కాగా, ఒమిక్రాన్‌ వేరియంట్‌ నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో భారత్‌తోపాటు ఎనిమిది దేశాల నుంచి విమానాల రాకపోకలపై హాంకాంగ్‌ రెండు వారాలపాటు ఆంక్షలు విధించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/