షర్మిల పాదయాత్రలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి..

వైఎస్సార్‌ తెలంగాణ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పేరుతో తెలంగాణ లో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. గత నాల్గు రోజులుగా కొనసాగుతున్న పాదయాత్ర.. 5వ రోజు మహేశ్వరం మండలం నాగారం నుండి మొదలైంది. ఈ పాదయాత్రలో సడెన్ షాక్ ఇచ్చారు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి . పాదయాత్ర లో షర్మిలను సుబ్బారెడ్డి కలిసి తన సంఘీ భావం తెలిపారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో కొత్త చర్చ తెరపైకి వచ్చింది. వైసీపీ పార్టీ స్వయంగా షర్మిల పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు కొందరు రాజకీయ నాయకులు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

తండ్రి , అన్న బాటలో తన రాజకీయ ప్రయాణం మొదలుపెట్టిన షర్మిల. తన తండ్రి , అన్న ఎలాగైతే పాదయాత్ర చేపట్టి ప్రజల కష్టాలు తెలుసుకున్నారో..షర్మిల కూడా అదే బాట పట్టింది. చేవెళ్ల నుంచి ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్రను మొదలుపెట్టింది. తల్లి విజయమ్మ షర్మిల చేపట్టిన పాదయాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఇదే చేవెళ్ల నుంచి 18 ఏళ్ల క్రితం వైఎస్సార్‌ తొలి అడుగు పడింది. ఇక షర్మిల తన పాదయాత్ర లో ప్రజల కష్టాలు అడిగి తెలుసుకోవడమే కాదు కేసీఆర్ సర్కార్ ఫై నిప్పులు చెరుగుతున్నారు.