దమ్ము ధైర్యం ఉంటే నకిలీ ఇన్సూరెన్స్‌లపై కేసులు పెట్టాలిః జేసీ ప్రభాకర్ రెడ్డి

jc-prabhakar-reddy-fires-on-officials-over-fake-insurance-certificate

అమరావతిః నకిలీ ఇన్సూరెన్స్ వ్యవహారంలో మీడియా ముందుకు వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి అధికారుల తీరును ప్రశ్నించారు. ఫేక్‌ డాక్యుమెంట్స్ సృష్టించారని అంటున్నారు, దమ్ము ధైర్యం ఉంటే నకిలీ ఇన్సూరెన్స్‌లపై కేసులు పెట్టాలని సవాల్ విసిరారు. రిజిస్ట్రేషన్‌ చేసేందుకు 11 రకాల డాక్యుమెంట్స్ కావాలని వివరించిన జేసీ.. నకిలీ ఇన్సూరెన్స్‌ పెడితే వాహనాలు ఎలా రిజిస్ట్రేషన్ చేశారని ప్రశ్నించారు. తాను స్క్రాప్ కింద కొనుగోలు చేసి, పేపర్లు పెడితే మీరేలా అనుమతులు ఇచ్చారు.. అధికారులంతా కేసుల్లో ఇరుక్కుంటారని జేసీ ప్రభాకర్ రెడ్డి కామెంట్ చేశారు.

తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఒక పిచ్చోడు, ఆయన ఇంట్లో పిచ్చోళ్ళు ఉన్నారు, వాళ్ల తమ్ముడు ఎక్కడున్నారో చెప్పాలన్నారు జేసీ. ధర్మవరం ఎమ్మెల్యే బైక్ రేస్‌లు, గుర్రాల రేస్‌లు చేసుకో, నీ నియోజకవర్గంలో గుడ్ మార్నింగ్ చేసుకో అంటూ సెటైర్లు విసిరారు జేసీ ప్రభాకర్ రెడ్డి. 28 వాహనాలను కొనుగోలు చేస్తే156 కేసులు పెట్టారంటూ జేసీ ఫైర్ అయ్యారు. రిజిస్ట్రేషన్ చేసిన అధికారి తనపై కేసు పెట్టారని.. దమ్ముంటే తనపై మరో కేసు పెట్టాలంటూ సవాల్ చేశారు. ఇప్పటికే తాను 156 రోజులు జైలుకి వెళ్లి బాధపడి వచ్చానని తెలిపారు.