తెలంగాణలో కాంగ్రెస్ లో చేరుతున్న 35 మంది జాబితా విడుదల : ఏఐసీసీ

35 మందితో కూడిన జాబితా రాహుల్ కు అందజేత

aicc-releases-35-joiners-list-of-telangana

హైదరాబాద్‌ః తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటోంది. పార్టీలో చేరుతున్న నేతలతో కళకళలాడుతోంది. కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో రాష్ట్ర పార్టీలో జోష్ కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో పార్టీలో చేరికలు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ లో చేరబోతున్న 35 మంది నేతలతో కూడిన లిస్ట్ ఆ పార్టీ అగ్రనేత రాహల్ గాంధీకి చేరింది. ఈ జాబితాను ఏఐసీసీ విడుదల చేసింది. జాబితాలో తొలి పేరు జూపల్లి కృష్ణారావుది కాగా… పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేరు 15వ స్థానంలో ఉంది. మరోవైపు రాహుల్, ఖర్గేలతో పొంగులేటి, జూపల్లిన భేటీ ముగిసింది.