రేపటి నుండి ఏజెంట్ స్ట్రీమింగ్..

అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్షన్లో AK ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ఫై ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఏజెంట్ మూవీ రేపటి నుండి స్ట్రీమింగ్ కాబోతుంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ..మొదటి రోజు మొదటి షో తోనే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో వారం తిరిగే లోపే థియేటర్స్ నుండి ఎత్తేసారు.

ఇక ఈ మూవీ డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న సోని లైవ్ ..రేపటి నుండి స్ట్రీమింగ్ చేయబోతుంది. ఈ సినిమాలో అఖిల్ సరసన సాక్షి వైద్య నటించగా, కీలక పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించాడు. మరి థియేటర్స్ లలో పెద్దగా సందడి చేయలేకపోయినా ఈ మూవీ ఓటిటి లో ఎంతమేర అలరిస్తుందో చూడాలి.