ముస్లిం దేశాలకు తాలిబన్ల విజ్ఞప్తి

కాబుల్: గత ఏడాది ఆగష్టులో ఆఫ్ఘనిస్తాన్‌ లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి.. ఆ దేశాన్ని తాలిబన్లు పాలనలోకి తెచ్చుకున్నారు. అప్పటి నుంచి ఆ దేశంలో మానవ హక్కులను కాలరాస్తూ తమదైన శైలిలో ఆంక్షలను విధిస్తూ.. అరాచక పాలన సాగిస్తున్నారు. అయితే తాజాగా తాలిబన్లు తమను తమ ప్రభుత్వాన్ని గుర్తించమంటూ.. ముస్లిం దేశాలకు మొరపెట్టుకున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌లోని తమ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించిన మొదటి వ్యక్తి కావాలంటూ తాలిబాన్ ప్రధాన మంత్రి బుధవారం ముస్లిం దేశాలకు పిలుపునిచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. తాలిబన్లు అధికారం చేజిక్కించుకున్నది మొదలు ఆఫ్ఘన్ ప్రజలకు అనేక ఆంక్షలు విధిస్తుంది. తాలిబన్ల తీరుపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాదు తాము తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించేందుకు సిద్ధం లేమంటూ ప్రపంచంలోని చాలా దేశాలు ప్రకటిస్తున్నాయి. వారి చర్యలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తూ.. అఫ్గాన్‌కు నిధులు అందకుండా చేశాయి. అయితే తాజాగా ఆఫ్ఘన్ విజ్ఞప్తి చేశారు.

అఖుంద్ కాబూల్‌లో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ.. దేశం భారీ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని.. దానిని పరిష్కరించే దిశగా తాము అడుగులు వేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని దౌత్యపరమైన గుర్తింపు గురించి ప్రస్తావిస్తూ.. ” అధికారుల కోసం.. మాకు ఎవరి సహాయం అక్కర్లేదు. .. అయితే దేశ ప్రజల కోసమే తాము కనీసం ముస్లిం దేశాలైన తమను గుర్తించి అండగా నిలబడాలని అన్నారు. అప్పుడే, దేశాన్ని త్వరగా అభివృద్ధి చేయగలమని అఖుంద్ అన్నారు. దేశంలో శాంతి భద్రతలను పునరుద్ధరించడం ద్వారా అవసరమైన అన్ని షరతులను తాలిబన్‌ ప్రభుత్వం నెరవేర్చిందని స్పష్టం చేశారు. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అక్కడ పరిస్థితులు మరింతగా దిగజారాయి. ఆ దేశంలో ఆర్థిక, ఆహార సంక్షోభం ఏర్పడింది. విదేశాల్లోని అఫ్గాన్‌ నిధులను ఆయా దేశాలు స్తంభింపజేశాయి. సెప్టెంబరులో అబ్బాయిలు ఆఫ్ఘనిస్తాన్ పాఠశాలలకు తిరిగి రావడానికి అనుమతించబడినప్పటికీ, బాలికల కోసం మాధ్యమిక పాఠశాలలు చాలావరకు మూసివేయబడ్డాయి. దేశంలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. ప్రభుత్వ ఉద్యోగులకు కొన్ని నెలలుగా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. సగం జనాభా ఆహార కొరతతో ఇబ్బంది పడే ముప్పు పొంచి ఉందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే తమ ప్రజల్ని కాపాడుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా బ్యాంకుల్లో నిల్వ ఉంచిన అఫ్గాన్‌ నిధుల్ని విడుదల చేయాలని, తమ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించాలని గత కొంతకాలంగా ప్రపంచదేశాలను తాలిబన్లు కోరుతున్నారు. అయితే గతంలో వీరి పాలన తీరుని దృష్టిలో పెట్టుకున్న ప్రపంచ దేశాలు ఇంకా తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించలేదు. 1996 మరియు 2001 మధ్య అధికారంలో ఉన్న సమయంలో మానవ హక్కుల ఉల్లంఘనలకు ప్రసిద్ధి చెందిన కరడుగట్టిన ఇస్లామిస్టులుగా ప్రసిద్ధి పొందారు. అయితే ఈసారి తాలిబాన్ల పాలన ఎలా ఉంటుందో అని ప్రపంచ దేశాలు చూస్తున్నాయి.

.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/