పాకిస్థాన్‌లో పెరిగిపోతున్న ద్రవ్యోల్బ‌ణం!

భారత్ కి నో చెప్పి అనుభ‌విస్తున్నారు

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బ‌ణం అంత‌కంత‌కూ పెరిగిపోతోంది. నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు చుక్క‌ల‌నంటుతున్నాయి. న‌గ‌రాల్లోనే కాదు గ్రామాల్లోనూ అదే దుస్థితి. స్టార్ పేస్ బౌల‌ర్ షోయ‌బ్ అక్త‌ర్ సొంతూరైన రావ‌ల్పిండిలో ఒక్క చాయ్ ధ‌ర రూ.40కి చేరింది. దీనికి కార‌ణం ఇండియాకు నో చెప్ప‌డ‌మే. ఇండియా నుంచి అత్యంత చ‌వ‌క‌గా చ‌క్కెర ల‌భించే అవ‌కాశం ఉన్నా.. మ‌న దేశం నుంచి దిగుమతులు అవ‌స‌రం లేద‌ని చెప్పి ఇప్పుడు అనుభ‌విస్తోంది.

చ‌క్కెర నుంచి టీపొడి, గ్యాస్‌, పాలు ఇలా అన్ని ధ‌ర‌లు పెరిగిపోతుండ‌టంతో చాయ్ ధ‌ర రూ.40కి చేరింది. పాలు లీట‌ర్‌కు రూ.120కి చేరింద‌ని అక్క‌డి చాయ్‌వాలా ఒక‌రు చెప్పాడు. గ్యాస్ సిలిండర్‌ ధ‌ర రూ.1500 నుంచి రూ.3000 వ‌ర‌కూ ఉంది. దీంతో చాయ్‌వాలాలు ధ‌ర‌లు పెంచేశారు. ఈ ధర‌లు భ‌రించ‌లేని వాళ్లు చాయ్ తాగ‌డ‌మే త‌గ్గించేశారు. కొంద‌రు పూర్తిగా మానేశారు. ఇది ఇలాంటి చిన్న చిన్న వ్యాపార‌స్తుల‌ను దారుణంగా దెబ్బ‌తీసింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/