‘నిమ్మగడ్డ’కు చెక్ – స్థానిక సంస్థలకు ప్రత్యేక అధికారుల పాలన: ఎపి ప్రభుత్వం
ఆదేశాలు జారీ

Amaravati: స్థానిక సంస్థల ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించేందుకు రాష్ర్ట ఎన్నికల కమిషన్ చేస్తున్న ప్రయత్నాలకు ఎపి ప్రభుత్వం చెక్ పెట్టింది..
ఒక వైపు ఇరు వర్గాలు సంప్రదింపులతో ఏకాభిప్రాయానికి రావాలని హైకోర్టు సూచనలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి స్పందన రాలేదు.. ఈ వివాదం ఇలా ఉండగా ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
జడ్పీ, ఎంపీపీల స్థానంలో ప్రత్యేక అధికారుల పాలన చేస్తామని ప్రకటించింది. మరో ఆరు నెలల పాటు పరిపాలన పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేస్తుంది.
మండల పరిషత్‌లో జూలై 3, జిల్లా పరిషత్ లో జూలై 4 వరకు ప్రత్యేక అధికారుల పాలన ఉంటుందన్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల్ కృష్ణ ద్వివేది ఆదేశాలు జారీ చేశారు.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/