హాస్పటల్ లో చేరిన హీరో అడివి శేషు

టాలీవుడ్ నటుడు అడివి శేషు హాస్పటల్ లో చేరారు. రీసెంట్ గా ఈయన డెంగ్యూ బారిన పడ్డారు. ఇంట్లోనే చికిత్స తీసుకుంటుండగా..రక్తంలో ప్లేట్‌లెట్స్ బాగా తగ్గిపోవడంతో హాస్పటల్ లో చేరినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయనకు డాక్టర్స్ చికిత్స అందిస్తున్నారు. శేష్‌ అనారోగ్యం గురించి తెలుసుకున్న అభిమానులు నటుడు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

ప్రస్తుతం శేషు “మేజర్” సినిమాతో బిజీగా ఉన్నాడు. ‘ 26/11 ముంబై టెర్రర్ అటాక్ లో అమరుడైన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో మహేష్ బాబు జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఏ ప్ల‌స్ ఎస్‌ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ మూవీని నిర్మిస్తోంది. ఈ మూవీ తో పాటు ‘గూఢచారి’కి సీక్వెల్‌గా ‘గూఢచారి 2’ చేస్తున్నారు.