ఆదిపురుష్ నుండి ‘జై శ్రీరామ్’ సాంగ్ రిలీజ్

ఆదిపురుష్ నుండి ‘జై శ్రీరామ్’ సాంగ్ రిలీజ్ అయ్యింది. ప్రభాస్ – కృతి సనన్ జంటగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రనౌత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ ఆదిపురుష్. సాహో, రాధేశ్యామ్ సినిమాల తర్వాత రాబోతున్న ఈ మూవీ ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో సైఫ్‌ అలీఖాన్‌ లంకాధిపతి రావణాసురుడుగా కనిపిస్తుండగా రాముడి గా ప్రభాస్ , సీతగా కృతి కనిపించనున్నారు. టీ-సిరీస్‌, రెట్రో ఫైల్స్ సంస్థలు అత్యంత భారీ బడ్జెట్‌తో దాదాపు రూ.500 కోట్లతో ఈ సినిమాను నిర్మించాయి. ఇక ఈ సినిమాను జూన్‌ 16న పాన్‌ ఇండియా లెవల్లో గ్రాండ్‌గా రిలీజ్‌ చేయబోతున్నారు.

ఈ క్రమంలో మేకర్స్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను స్పీడ్ చేసారు. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ కు అద్భుతమైన స్పందన రాగా..శనివారం సినిమాలోని జై శ్రీరామ్ సాంగ్ ను రిలీజ్ చేసారు. సంగీత ద్వయం అజయ్-అతుల్ స్వరపరిచిన ఈ పాట ఎంతగానో ఆకట్టుకుంటుంది. సాంగ్ ప్రారంభంలో ‘‘ఎవరు ఎదురురాగలరు మీ దారికి, ఎవరికుంది ఆ అధికారం.. పర్వత పాదాలు వణికి కదుల్తాయి మీ హూంకారానికి’’ అంటూ రాముడి పాత్రధారి ప్రభాస్ చెప్పే డైలాగ్ తో పాట మొదలైంది. 2:39 నిమిషాల పాటలో ‘జైశ్రీరామ్’ అంటూ వచ్చిన ప్రతిసారి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ‘‘మహిమాన్విత మంత్రం నీ నామం.. జై శ్రీ రామ్.. జై శ్రీరామ్.. రాజారాం’’ అంటూ వచ్చే సంగీతం మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉంది.

YouTube video