కేసీఆర్ నిజామాబాద్ పర్యటన ఫై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శలు

mp dharmapuri arvind fire to kcr

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం జిల్లాల పర్యటన లో బిజీ గా ఉన్నారు. పలు జిల్లాలో కొత్తగా నిరించిన కలెక్టరేట్ ఆఫీసులను ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాలో నూతన కలెక్టరేట్ ఆఫీసులను ప్రారంభించిన కేసీఆర్..ఈ నెల 05 న నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ ను ప్రారంభించనున్నారు. కాగా కేసీఆర్ నిజామాబాద్ పర్యటన ఫై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శలు కురిపించారు.

గత రెండేళ్లుగా నూతన కలెక్టరేట్ వరదల్లో మునిగిపోయిందని, ఇప్పుడు కలెక్టరేట్ ప్రారంభోత్సవం ఎందుకని ప్రశ్నించారు. అంతే కాదు కేసీఆర్ రాక సందర్భంగా ఆయన ఇచ్చిన హామీలను గుర్తు చేసేందుకు ఈ నెల 3న తాము ఇందూరులో ‘జన్ కో జవాబ్ దో కేసీఆర్’ పేరుతో సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలపై లేఖలు రాసి ఇందూరులో ఇంటింటికి పంపిణీ చేస్తామన్నారు. ఎన్నికల హామీలు ఎందుకు అమలు చేయలేదో ఇందూరు ప్రజలకు సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మూడు నెలల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంలోని పెద్దలు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డికి జిల్లా అభివృద్ధిపై ఏ మాత్రం శ్రద్ధ లేదన్నారు. ఆర్మూర్ లో గుట్టలన్నీ మాయం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్పీకర్ పోచారం కుటుంబ సభ్యులు అక్రమంగా ఇసుక దందా చేయడం సిగ్గుచేటన్నారు. కల్లుగీత కార్మికులు, యాదవులు, నాయి బ్రాహ్మణులు, రజక సోదరులకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదో సీఎం కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి జిల్లా ఎంపీ అయిన తనకు ఇప్పటి వరకు ఎలాంటి ఆహ్వానం అందలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు.