వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవలు ప్రారంభం..

ఏపీలో వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవలను ప్రారంభించారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. సుమారు రూ.278 కోట్ల వ్యయంతో మొత్తం 340 పశువుల అంబులెన్స్‌లు ఏర్పాటు చేస్తుండగా.. తొలిదశలో రూ.143 కోట్లతో సిద్ధం చేసిన 175 అంబులెన్స్‌లను తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయం వద్ద గురువారం జగన్‌మోహన్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.

ప్రాధమిక వైద్య సేవలతో పాటు సన్న జీవాలు, పెంపుడు జంతువులు, పక్షులకు సర్జరీలు చేసేందుకు వీలుగా వాహనాల రూపకల్పన చేశారు. టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1962 తో పశు వైద్య టెలి మెడిసిన్‌ ఏర్పాటు చేసింది సర్కార్‌. ఒక్కో అంబులెన్స్‌ మెయిన్‌టెనెన్స్‌ ఖర్చుల నెలకు 1.90 లక్షలు ఖర్చు చేస్తుండగా.. రెండేళ్ళకు మొత్తం రూ. 155 కోట్ల నిధులు ఖర్చు చేయనుంది ప్రభుత్వం.

ఇక అంబులెన్స్‌లో సౌకర్యాలు చూస్తే..

  • ఒక పశువైద్యుడు, వెటర్నరీ డిప్లొమా చేసిన సహాయకుడు, డ్రైవర్‌ కమ్‌ అటెండర్‌ ఉంటారు.
  • 20 రకాల పేడ సంబంధిత పరీక్షలు, 15 రకాల రక్తపరీక్షలు చేసేందుకు మైక్రోస్కోప్‌తో కూడిన చిన్న ప్రయోగశాల.
  • అన్ని రకాల వ్యాక్సిన్లు, మందులతోపాటు పశువును వాహనంలోకి ఎక్కించేందుకు హైడ్రాలిక్‌ సౌకర్యం
  • ప్రాథమిక వైద్యసేవలతో పాటు సన్నజీవాలు, పెంపుడు జంతువులు, పక్షులకు సర్జరీలు చేసేందుకు ఏర్పాట్లు
  • అవసరమైతే హైడ్రాలిక్‌ లిఫ్ట్‌ సౌకర్యంతో పశువును వాహనంలోకి ఎక్కించి శస్త్రచికిత్స చేసే సౌలభ్యం.