రాఖి శుభాకాంక్షలు తెలిపిన భోళాశంకర్..

అక్కా చెల్లెళ్లందరికి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. రీసెంట్ గా ఆచార్య మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి..ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో భోళా శంకర్ మూవీ ఒకటి. మెహర్ రమేష్ డైరెక్షన్లో ఏకే ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ పతాకం పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా , కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలుగా నటిస్తుంది. ఇక ఈరోజు రాఖి సందర్బంగా మేకర్స్ సరికొత్త వీడియో ను రిలీజ్ చేసారు.

ఈ వీడియో లో కీర్తి సురేష్‌.. చిరంజీవికి రాఖీ కట్టినట్లు చూపించారు. అంతేకాదు.. ప్రతి తెలుగు ఇంటి ఆరాధ్యుడు! వెన్నంటి ఉండే అందరివాడు! మన భోళా శంకరుడు అంటూ ఆ వీడియోకు క్యాప్షన్‌ ఇచ్చారు మేకర్స్. సిస్టర్ సెంటిమెంట్ కథ తో పూర్తి స్థాయి మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘భోళా శంకర్’ తెరకెక్కుతుంది. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం చిరంజీవి ఈ మూవీ తో పాటు మోహన్ రాజా డైరెక్షన్లో గాడ్ ఫాదర్ మూవీ , బాబీ డైరెక్షన్లో మరో మూవీ చేస్తున్నాడు.