నటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూత

టాలీవుడ్ లో విషాదం

Actor Nursing Yadav -File
Actor Nursing Yadav -File

Hyderabad: ప్రముఖ తెలుగు చిత్ర నటుడు నర్సింగ్ యాదవ్(52) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన..సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆయన గుర్తుండిపోయే పాత్రలు చేశారు. ముఖ్యంగా ఆయన విలన్, కామెడీ విలన్ వేశాలు వేశారు. అన్ని భాషల్లో కలిపి ఆయన 300 పైగా చిత్రాల్లో నటించారు. ‘హేమాహేమీలు’ సినిమాతో ఆయన ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

నర్సింగ్ యాదవ్ స్వస్థలం హైదరాబాద్. ముఠామేస్త్రి, శంకర్ దాదా ఎమ్.బి.బి.ఎస్, గాయం, కిల్లర్, మాస్, మాయలోడు, ఫ్యామిలీ సర్కస్, టెంపర్, రేసుగుర్రం, పిల్ల జమిందార్, అన్నవరం, సైనికుడు వంటివి ఉన్నాయి. నర్సింగ్ యాదవ్‌కు భార్య చిత్ర యాదవ్, తనయుడు రుత్విక్ యాదవ్ ఉన్నారు

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/