మలయాళ నటుడు బాబూరాజ్ వాజపల్లి కన్నుమూత

మలయాళ చిత్రసీమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ నటుడు బాబూరాజ్ వాజపల్లి(59) తుదిశ్వస విడిచారు. బాబూరాజ్‌కు ఛాతిలో నొప్పి రావడంతో కేరళలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్స్ ధృవికరించారు. బాబురాజ్ ఆకస్మిక మరణంతో మలయాళ చిత్ర పరిశ్రమలో విషాద చాయలు నెలకొన్నాయి.

బాబురాజ్‌కు భార్య సంధ్య, కుమారుడు బిషన్‌లు ఉన్నారు. ‘త్రిస్సూర్‌లో డ్రామా స్కెచ్‌’ల ద్వారా కెరీర్ ప్రారంభించాడు బాబురాజ్‌. బాబూరాజ్ ఆండ్రాయిడ్ కుంజప్పన్, సీఐఏ, మాస్టర్ పీస్, గుండా జయన్, బ్రేకింగ్ న్యూస్, మనోహరన్ ,అర్చన 31 నాటౌట్ వంటి మలయాళ హిట్ చిత్రాలలో కీలక పాత్రలు పోషించాడు. కేవలం నటుడిగానే కాకుండా ఆర్ట్ డైరెక్టర్, స్క్రీన్ రైటర్‌గా కూడా ఆయన పనిచేశారు. ఆయన మృతికి పలువురు మాలీవుడ్‌ నటీనటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.