నాగార్జున సాగర్‌కు కొనసాగుతున్న భారీ వరద..26 గేట్లు ఎత్తివేత

26 gates of Nagarjuna Sagar lifted due to heavy inflow

నల్లగొండః శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌కు భారీ వరద కొనసాగుతున్నది. దీంతో అధికారులు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 26 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రాజెక్ట్‌లోకి ఇన్ ఫ్లో : 4,38,446 క్యూసెక్కులు..ఔట్ ఫ్లో : 3,36,672 క్యూసెక్కులుగా ఉంది.

ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటి మట్టం : 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం : 588.00 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ: 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం : 306.1010 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అయితే 2009 తర్వాత మళ్లీ 2022 లో 26 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలినట్లు అధికారులు తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/