ఈ నెల 5న ఏపిలో పాఠశాలలు బంద్‌ ?

abvp-demands-schools-bandh-in-andhra-pradesh-for-these-reasons

అమరావతిః ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు జూలై 5వ తేదీ అనగా బుధవారం బంద్ కానున్నాయి. ప్రైవేటు, కార్పోరేట్ పాఠశాలల ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా ఈ బంద్‌కు పిలుపునిచ్చినట్టు అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్(ఏబీవీపీ) వెల్లడించింది. ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక సదుపాయాలను వెంటనే సమకూర్చాలని ఏబీవీపీ పేర్కొంది.

అటు ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల పేరుతో విద్యార్ధుల తల్లిందండ్రుల నుంచి నిలువుదోపిడీ చేస్తున్నారని.. లక్షల్లో డబ్బును కట్టించుకుంటున్నారని తెలిపింది. ఈ దోపిడీని అరికట్టడమే కాకుండా.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. అలాగే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలలో సరిపడా టీచర్ల నియామకాన్ని వెంటనే చేపట్టాలని స్పష్టం చేసింది. గుర్తింపు లేకుండా నడిపిస్తున్న ప్రైవేటు స్కూల్స్‌ను గుర్తించి.. వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పింది. కాగా, ఈ నెల 5న చేపట్టే బంద్‌కు అన్ని వర్గాల వారు సహకరించి విజయవంతం చేయాలని కోరింది.