కియా వెళ్లిపోతుందని చంద్రబాబు అభూత కల్పన

విజయసాయిరెడ్డి ఆరోపణ

vijayasai reddy
vijayasai reddy

అమరావత: వైఎస్‌ఆర్‌సిపి ఎంపి విజయసాయిరెడ్డి టిడిపి అధినేత చంద్రబాబుపై పలు ఆరోపణలు గుప్పించారు. కియా తరలింపుపై ఆయనే రాయిటర్‌లో అసత్య వార్త రాయించారని విజయసాయిరెడ్డి అన్నారు. ‘ఎంత పెద్ద అబద్ధమైనా రాయిస్తాడు చంద్రబాబు. అన్నింటికి తెగబడి పోయాడు. ఎల్లో మీడియా వార్తలు ప్రజలు నమ్మడం లేదని రాయిటర్ ఏజెన్సీ పేరుతో కియా వెళ్లిపోతుందని అభూత కల్పన సృష్టించాడు. ప్రజా క్షేత్రంలో తేల్చుకునే దమ్ములేక ఇలాంటి పిరికిపంద పనులకు పాల్పడుతున్నాడు’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. కాగా, రాయిటర్‌లో వచ్చిన ‘కియా తరలింపు’ వార్త ఏపీలో విమర్శలు, ప్రతి విమర్శలకు దారి తీసిన విషయం తెలిసిందే.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/