ఫుల్ గా మద్యం సేవించి..స్నేహితుడి భార్య ను అత్యాచారం చేసి చంపేశారు

ఇటీవల కాలంలో మనుషుల్లో మానవ సంబంధాలకు విలువ ఇవ్వడం లేదు. తమ కామ కోరిక తీర్చుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. సామాన్య మహిళలే కాదు సొంత బిడ్డలను సైతం వదలడంలేదు. తాజాగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం తారామతిపేట్‌లో దారుణం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే..

అబ్దుల్లాపూర్​మెట్​లోని ఓ వ్యక్తి ఇద్దరు స్నేహితులతో కలిసి ఇంటికి వచ్చాడు. ముగ్గురు కలిసి మద్యం సేవించారు. అక్కడే ఇంట్లోనే ఉన్న స్నేహితుడి భార్యపై కన్నేసిన ఆ ఇద్దరు స్నేహితులు.. ఆమె భర్తకు ఫుల్ గా మద్యం తాగించారు. అతడు స్పృహ కోల్పోగానే.. ఇద్దరు కలిసి వివాహితపై అత్యాచారం చేశారు. ఆమె ప్రతిఘటించప్పటికీ ఆ మృగాలు కనికరించలేదు. మరింత రెచ్చిపోయి ఆమెను హత్యచేశారు. స్పృహ నుండి తేరుకున్నాక విగతజీవిలా పడిఉన్న భార్య ను చూసి షాక్ అయ్యాడు. అసలు ఏంజరిగిందో గుర్తు తెచ్చుకొని..వెంటనే పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. పిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి క్లూస్ టీం, డాగ్స్ స్వాడ్​తో విచారణ చేపట్టారు. నిందితుడు సురేశ్​ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో నిందితుడు శ్రీకాంత్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.