వైసీపీ సర్కార్ కు షాక్ : 13 మంది సర్పంచుల రాజీనామా

వైసీపీ సర్కార్ కు షాక్ : 13 మంది సర్పంచుల రాజీనామా

కడప జిల్లా కాజీపేట మండలంలో 13 మంది వైసీపీ సర్పంచులు మూకుమ్మడి రాజీనామా చేసి సర్కార్ కు షాక్ ఇచ్చారు. గ్రామ పంచాయతీకి నిధులు రావడం లేదన్న ఆవేదనతో తాము రాజీనామా చేశామని తెలిపారు. సర్పంచ్ గా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా నిధులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ లేఖ కూడా విడుదల చేశారు. సంక్షేమ పథకాల అమలు లో సర్పంచుల పాత్ర లేకుండా చేయడమే కాక… 14 వ, 15 వ ఫైనాన్స్‌ కమిషన్‌ నిధులను కూడా ప్రభుత్వం దారి మళ్ళించిందని .. ప్రభుత్వం నియంతృత్వ పోకడలను వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేయడానికి మీమంతా సిద్ధమయ్యామని తెలిపారు.

ఈరోజు నుండి ఆయా పంచాయతీలలో.. వీధి దీపాల నిర్వహణ, రోడ్ల మరమ్మత్తు లను.. శానిటేషన్‌ కార్య క్రమంతో పాటు గా తదితర నిర్వహణ భారాలను బహిష్కరిస్తున్నట్లు గా తెలియజేశారు. ఖాజీపేట మండలంలో మొత్తం 21 పంచాయతీలు ఉండగా.. 13 సర్పంచులు ప్రత్యేకంగా సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు.