పాక్‌లో పేలుడు..ఏడుగురు మృతి

Peshawar blast

పాకిస్థాన్‌: పాకిస్థాన్‌లోని పేషావ‌ర్‌లో ఓ శిక్ష‌ణ స్కూల్‌లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందారు. మ‌రో 70 మంది గాయ‌ప‌డ్డారు. పేలుడు ఘ‌ట‌న‌కు సంబంధించి విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు పేషావ‌ర్ పోలీసు ఆఫీస‌ర్ మ‌న్సూర్ అమ‌న్ తెలిపారు. ఐఈడీతో పేలుడుకు పాల్ప‌డి ఉంటార‌ని ప్రాథ‌మికంగా అంచ‌నా వేస్తున్నారు. ప్రాంతాన్ని చుట్టుముట్టిన పోలీసులు.. క్లూస్ సేక‌రిస్తున్నారు. స్కూల్‌లో ఖురాన్ పాఠాలు బోధిస్తున్న స‌మ‌యంలో పేలుడు జ‌రిగిన‌ట్లు పోలీసు అధికారి వెల్ల‌డించారు. ఎవ‌రో ఓ వ్య‌క్తి బ్యాగ్‌తో ఆ శిక్ష‌ణాల‌యంలోకి వెళ్లిన‌ట్లు తెలిపారు. గాయ‌ప‌డ్డ‌వారిలో చిన్నారుల సంఖ్య ఎక్కువ‌గా ఉన్న‌ది. మ‌త‌ప‌ర‌మైన శిక్ష‌ణ త‌ర‌గ‌తులు జ‌రుగుతున్న బిల్డింగ్‌లో పేలుడు జ‌ర‌గ‌డం వ‌ల్ల చిన్నారులు, శిక్ష‌కులు ఎక్కువ సంఖ్య‌లో గాయ‌ప‌డ్డారు. బ్యాగ్‌లో ఉన్న బాంబు.. టైమ్ బాంబు అయి ఉంటుంద‌ని కూడా భావిస్తున్నారు. దాదాపు అయిదు కిలోల పేలుడు ప‌దార్దాలు వాడిన‌ట్లు అనుమానిస్తున్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/