ఏపీ లో కేసీఆర్ అడుగుపెట్టబోతున్నాడా..?

ఏపీ లో కేసీఆర్ అడుగుపెట్టబోతున్నాడా..?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టబోతున్నారా..? తాజాగా ఈయన మాట్లాడిన తీరు బట్టి చూస్తే..ఆంధ్రాలో కూడా పార్టీ పెట్టబోతున్నట్లు అర్ధమవుతుంది. హైదరాబాద్ లో తెరాస ప్లినరీ సమావేశం జరుగుతుంది. ఈ సందర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలు కావాలని ఆంధ్ర ప్రజలు కోరుతున్నారని చెప్పారు. ఉత్తరాంధ్రకు చెందిన వేలాది మంది కూలీలు తెలంగాణకు వచ్చి పని చేస్తున్నారని అన్నారు.

తమ ప్రాంతాలను తెలంగాణలో కలపాలనే డిమాండ్లు పక్క రాష్ట్రాల్లో వినిపిస్తున్నాయని కేసీఆర్ చెప్పారు. నాందేడ్, రాయచూర్ జిల్లాల నుంచి ఈ డిమాండ్లు వచ్చాయని తెలిపారు. మనం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆశ్చర్యపోతున్నారని చెప్పారు. దేశ విదేశాల్లో కూడా తెలంగాణ ప్రతిష్ఠ ఇనుమడిస్తోందని అన్నారు. సాహసం లేకపోతే దేన్నీ సాధించలేమని తెలిపారు.

తెలంగాణ‌లో అద్భుతంగా వ్య‌వ‌సాయ స్థీరీక‌ర‌ణ జ‌రిగింది. మ‌నం విడిపోయిన ఏపీ త‌ల‌సరి ఆదాయం రూ. 1.70 ల‌క్ష‌లే. తెలంగాణ త‌ల‌స‌రి ఆదాయం రూ. 2.35 ల‌క్ష‌ల‌కు పెరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డితే క‌రెంట్ స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని కొందరు ఏపీ నేత‌లు అపోహ‌లు సృష్టించారు. కానీ తెలంగాణ‌లో 24 గంట‌ల నాణ్య‌మైన ఉచిత క‌రెంట్ ఇస్తున్నాం. ఆంధ్రాలో 24 గంట‌ల క‌రెంట్ ఇచ్చే ప‌రిస్థితి లేదు. అన్ని రంగాల్లో తెలంగాణ ప్ర‌భుత్వం స‌ఫ‌లీకృత‌మ‌వుతంద‌ని సీఎం కేసీఆర్ అన్నారు.