భారత్‌ బయోటెక్‌కు 64 దేశాల రాయబారులు

వ్యాక్సిన్ల పురోగ‌తిని తెలుసుకోనున్న రాయబారులు

foreign-delegates-visits-bharat-biotech

హైదరాబాద్‌: కరోనా నివారణ కోసం వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోన్న భార‌త్ బ‌యోటెక్‌, బ‌యోలాజిక‌ల్ఈ లిమిటెడ్ సంస్థ‌ల‌ను సంద‌ర్శించడానికి విదేశాల నుంచి 64 మంది రాయబారులు హైదరాబాద్ వచ్చారు. పలు దేశాల రాయ‌బారులు, హైక‌మిష‌న‌ర్లు ఈ బృందంలో ఉన్నారు. కరోనా వ్యాక్సిన్లపై వారు చ‌ర్చించ‌నున్నారు. వీరు రెండు గ్రూపులుగా భార‌త్ బ‌యోటెక్‌, బ‌యోలాజిక‌ల్ఈ సంస్థ‌ల‌ను సందర్శిస్తారు.

వ్యాక్సిన్ త‌యారీపై ఫోటో ఎగ్జిబిష‌న్‌ను ఈ బృందాలు చూస్తాయి. ఇక్కడ వ్యాక్సిన్ల పురోగ‌తిని తెలుసుకుని ఆ తర్వాత శాస్త్రవేత్త‌ల‌తో సమావేశం అవుతారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంట‌ల‌కు ఢిల్లీ బ‌య‌ల్దేరతారు. విదేశీ ప్ర‌తినిధులు వస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసింది. భారత్‌ బయో‌టెక్‌ అభి‌వృద్ధి చేస్తున్న కొవా‌గ్జిన్‌ వ్యాక్సిన్ ప్రస్తుతం మూడో‌దశ ట్రయల్స్‌ ను కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/