పసిఫిక్‌ మహాసముద్రంలో భూకంపం

Richter scale graph
Earthquake

టోన్గా: బుధవారం అర్ధరాత్రి పసిఫిక్‌ మహాసముద్రంలోని టోన్గా తీర ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 6.4గా నమోదైనట్లు యునైటెడ్‌ స్టేట్స్‌ జియోలాజికల్‌ సర్వే (యూసీఎస్‌జీఎస్‌) తెలిపింది. అర్ధరాత్రి ఒంటిగంటా 13 నిమిషాల సమయంలో ప్రకంపనలు సంభవించినట్లు పేర్కొంది. లైఫ్కా ద్వీపం పశ్చిమతీరానికి 37 కిలోమీటర్ల దూరంలోని పంగై గ్రామానికి ఈశాన్యంగా 35 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నిక్షిప్తమై ఉందని వెల్లడించింది. భూప్రకంపనల కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదు. సునామి హెచ్చరికలు సైతం జారీ చేయలేదు. టోన్గా రాజ్యం రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌గా ప్రసిద్ధి. ఇది భూకంప క్రియాశీల జోన్‌లో ఉండటంతో తరచూ భారీ భూకంపాలు సంభవిస్తుంటాయి.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/