ఖమ్మం జిల్లాలో 54 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ

జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరణ

ఖమ్మం: టీడీపీ వ్యవస్థాపకుడు, ప్రముఖ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు శ్రీకృష్ణుడి వేషంలో ఉన్న 54 అడుగుల విగ్రహం రూపుదిద్దుకుంటోంది. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా మే 28న ఖమ్మం జిల్లా లకారం చెరువులో దీనిని ఆవిష్కరించనున్నారు. రూ. 2.3 కోట్ల ఖర్చుతో ఎన్టీఆర్ అభిమానులు దీనిని ఏర్పాటు చేస్తున్నారు. నిజామాబాద్‌లో దీనిని తయారుచేస్తుండగా, పనులు తుది దశకు చేరుకున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా దీనిని ఆవిష్కరించేందుకు అభిమానులు సన్నాహాలు చేస్తున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/