సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వసం కేసులో 52 మంది అరెస్టు..

‘‘అగ్నిపథ్’’ను వ్యతిరేకిస్తూ.. సికింద్రాబాద్ రైల్లేస్టేషన్‌లో ఆందోళనకారులు బీబత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. కేంద్రం తీసుకొచ్చిన అగ్ని పథ్ స్కీంకు వ్యతిరేకంగా నిన్న శుక్రవారం ఆర్మీ విద్యార్థులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను అగ్ని గుండంగా మార్చిన సంగతి తెలిసిందే. కేంద్రం వైఖరిని నిరసిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వందలాది మంది యువకులు చొరబడి నిమిషాల వ్యవధిలోనే హింసాత్మకంగా మార్చారు. రైళ్ల అద్దాలు ధ్వంసం చేయడంతో పాటు బోగీలకు నిప్పు పెట్టారు.

అంతటితో శాంతించని ఆందోళనకారులు ఫ్లాట్ ఫాంలను పూర్తిగా ధ్వంసం చేశారు. హౌరా ఎక్స్‌ప్రెస్‌, ఈస్ట్‌ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ సహా మూడు రైళ్లకు నిప్పంటించారు. రైల్వే స్టేషన్ బయట బస్సులపై రాళ్లు రువ్వారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు జరుపగా..ఓ యువకుడు మృతి చెందడం జరిగింది. ఇక ఈ దాడికి పాల్పడిన కేసులో 52 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అల్లర్ల కేసును పోలీసులు కుట్ర కోణంలో విచారిస్తున్నారు. 200లకు పైగా అభ్యర్థులు అల్లర్ల‌లో పాల్గొన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం వీరికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్ట్. దీంతో వారిని చంచల్ గూడా జైలు కు తరలించారు.