మంత్రి అంబటి పై బండ్ల గణేష్‌ ఫైర్..ఏకంగా రంభల రాంబాబు అంటూ కామెంట్స్

వైస్సార్సీపీ మంత్రి అంబటి రాంబాబు ఫై సినీ నిర్మాత బండ్ల గణేష్ పలు కీలక వ్యాఖ్యలు చేసారు. ఏకంగా రంభల రాంబాబు గారు మా సారు త్వరలో మీకు సమాధానం చెబుతారంటూ పోస్ట్ చేసి మరోసారి పవన్ కళ్యాణ్ ఫై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. చేనేత దినోత్సవం రోజున.. కాటాన్‌ దుస్తులు ధరించాలని పవన్‌ కళ్యాణ్‌ పలువురికి చాలెంజ్ విసిరిన సంగతి తెలిసిందే. ఈ ఛాలెంజ్ ను పలువురు స్వీకరించడం జరిగింది. అయితే… ఆ ఛాలెంజ్ కు కౌంటర్‌ గా అంబటి రాంబాబు సెటైర్‌ వేశారు.

కాటన్ దుస్తుల ఛాలెంజ్ లు ఆపి 175 సీట్లకి పోటీ చేస్తున్నారా! లేదా? ఇండిపెండెన్స్ డే రోజునైనా ప్రకటించండి అంటూ పవన్‌ కళ్యాణ్‌ కు చురకలు అంటించారు. అయితే.. రాంబాబు ట్వీట్‌ కు బండ్ల గణేష్‌ కౌంటర్‌ ఇచ్చారు. అలాగే రంభల రాంబాబు గారు మా సారు త్వరలో మీకు సమాధానం చెబుతారంటూ రివర్స్‌ అటాక్‌ చేశారు. ప్రస్తుతం గణేష్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

ఇక బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కమెడియన్ గా చిత్రసీమలో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ టైంలోనే అగ్ర నిర్మాతగా ఎదిగారు. ప్రస్తుతం సినిమాలు నిర్మించడం తగ్గించి వ్యాపారాల ఫై ఫోకస్ పెట్టారు.