బాలయ్య మూవీలో పవర్ ఫుల్ రోల్
వరలక్ష్మీ శరత్‌కుమార్‌కు ఆఫర్

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో పక్కా మాస్ కమర్షియల్ మూవీలో వరలక్ష్మీ శరత్‌కుమార్ నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రంలో ప్రతి నాయకుడి పాత్ర ద్వారా కన్నడ నటుడు దునియా విజయ్ తెలుగు పరిశ్రమకు పరిచయమవుతున్నాడు. బాలకృష్ణ 107వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలోని ఓ కీలక పాత్ర కోసం వరలక్ష్మీ ని ఎంపిక చేసుకున్నారు. ఇదే విషయాన్ని చిత్ర బృందం బుధవారం అధికారికంగా ప్రకటించింది.
గోపీచంద్ మలినేని తెరకెక్కించిన క్రాక్ చిత్రం నటిగా వరలక్ష్మీ శరత్‌కుమార్ కి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. దీంతో టాలీవుడ్ లో పవర్ ఫుల్ పాత్రలకు జయమ్మ కేరాఫ్ అడ్రస్ గా మారింది. బాలకృష్ణ 107వ సినిమాలో మరోసారి పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుంది వరలక్ష్మి.
మాస్ హీరో మరియు మాస్ దర్శకుడు ఇద్దరూ కలిసి మాస్ ఆడియన్స్ కి ఈ సినిమాతో మాంచి విందు భోజనాన్ని అందించడం ఖాయంగా కనిపిస్తోంది. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు గోపీచంద్ మలినేని.
నవీన్ ఎర్నేని, వై రవి శంకర్ సంయుక్తంగా అత్యంత భారీగా నిర్మిస్తున్న ఈ మూవీకి తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి రిషీ పంజాబీ సినిమాటోగ్రఫి, నవీన్ నూలీ ఎడిటింగ్, రామ్ లక్ష్మణ్ ఫైట్స్. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించనున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/