విరిగిప‌డ్డ కొండ‌చ‌రియ‌లు.. 47 మంది స‌జీవ స‌మాధి

47-buried-over-200-evacuated-as-massive-landslide-hits-china

బీజింగ్ః చైనాలో విషాదం నెల‌కొంది. యునాన్ ప్రావిన్స్‌లోని గిరిజ‌న‌, ప‌ర్వ‌త ప్రాంతాల్లోని కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. దీంతో 47 మంది స‌జీవ‌స‌మాధి అయ్యారు. ఈ ఘ‌ట‌న సోమ‌వారం తెల్ల‌వారుజామున 5:51 గంట‌ల స‌మ‌యంలో చోటు చేసుకుంది. పోలీసులు, ఫైర్ సిబ్బంది, విప‌త్తు ద‌ళాలు క‌లిసి స‌హాయ‌క చ‌ర్య‌ల్లో నిమ‌గ్న‌మ‌య్యాయి. కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ‌టంతో 18 ఇండ్లు నేల‌మ‌ట్టం అయ్యాయి. ఆ నివాసాల్లో 200 మందికి పైగా నివాసం ఉంటున్నారు. అయితే విరిగిప‌డ్డ కొండ‌చ‌రియ‌ల‌ను తొల‌గిస్తున్నారు. శిథిలాల కింద ఉన్న మృత‌దేహాల‌ను వెలికి తీస్తున్నారు. స‌హాయ‌క చ‌ర్య‌ల్లో 200 మంది పాల్గొన్నారు. గాయ‌ప‌డ్డ వారిని చికిత్స నిమిత్తం స‌మీప ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించేందుకు అంబులెన్స్‌ల‌ను సిద్ధంగా ఉంచారు. విరిగిపడిన కొండచరియల్లో ఇరుక్కుపోయిన వారిని రక్షించడం కోసం 33 అగ్నిమాపక వాహనాలు, 10 లోడింగ్ మెషీన్లను ఘటనా స్థలానికి తరలించి సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు 200 మంది రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.