ఆర్మీ క్యాంప్​పై ఆత్మాహుతి దాడి.. అమరులైన ముగ్గురు జవాన్లు

పర్గల్ వద్ద సైనిక శిబిరంలోకి ప్రవేశించేందుకు ఉగ్రవాదుల యత్నం

3 Soldiers Killed In Action In J&K Army Camp Attack, 2 Terrorists Shot Dead

శ్రీనగర్‌ః స్వతంత్య్ర వజ్రోత్సవ వేడుకల వేళ జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు మృతి చెందగా, ఇద్దరు ఉగ్రవాదులు కూడా మరణించారు. రాజౌరీ ప్రాంతానికి 25 కిలోమీటర్ల దూరంలో పర్గల్ ఆర్మీ క్యాంపు వద్ద ఈ దాడి జరిగింది.

సైనిక శిబిరాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడేందుకు యత్నించారు. శిబిరంలోకి ప్రవేశించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించడాన్ని గుర్తించిన భద్రతా బలగాలు వెంటనే స్పందించాయి. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ దాడిలో మరో ఐదుగురు సైనికులకు గాయాలయ్యాయి. ప్రస్తుతం అక్కడ మరింతమంది ఉగ్రవాదులు ఉండొచ్చన్న అనుమానంతో భారీ ఎత్తున గాలింపు చేపడుతున్నారు. పర్గల్ ప్రాంతానికి పెద్ద సంఖ్యలో బలగాలను తరలిస్తున్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/