ఏ క్ష‌ణమైనా కార్మికులు సొరంగం నుంచి బ‌య‌ట‌కు.. అంబులెన్సులు..ఆక్సిజ‌న్ బెడ్స్‌ రెడీ..

41 Trapped Workers To Be Pulled Out Shortly, After 17-Day Tunnel Nightmare

డెహ్రాడూన్‌: ఉత్త‌రాఖండ్‌లోని సిల్కియారా ట‌న్నెల్‌ లో చిక్కుకున్న 41 మంది కార్మికులు మ‌రికొన్ని గంట‌ల్లో బ‌య‌ట‌కు రానున్నారు. ఆ సొరంగంలో చిక్కిన కార్మికుల్ని బ‌య‌ట‌కు లాగేందుకు పైప్‌లైన్ వేశారు. ఆ ప‌నులు పూర్తి అయిన‌ట్లు కాసేప‌టి క్రితం సీఎం ధామి తెలిపారు. అయితే కార్మికులు బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత వారికి చికిత్స‌ను అందించేందుకు అంబులెన్సుల‌ను కూడా సిద్ధం చేశారు. మొత్తం 41అంబులెన్సులు సైట్ వ‌ద్ద రెఢీగా ఉన్నాయి. చిన్యలిస‌ర్ క‌మ్యూనిటీ హెల్త్ సెంట‌ర్ వ‌ద్ద కార్మికుల కోసం బెడ్ల‌ను ఏర్పాటు చేశారు. ప్ర‌త్యేక‌మైన వార్డులో 41 ఆక్సిజ‌న్ బెడ్ల‌ను రెడీ చేశారు.