ఏపిలో కొత్తగా 3,963 కేసులు నమోదు

ఒక్కరోజే 52 మరణాలు

ఏపిలో కొత్తగా 3,963 కేసులు నమోదు
corona virus – ap

అమరావతి: ఏపిలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లో 3963 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.  52 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. దాంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 586కి పెరిగింది. 1411 మంది కరోనా నుంచి సంపూర్ణంగా కోలుకుని డిశ్చార్జ్ అయినట్ల వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 44,609కి చేరింది. ప్రస్తుతం 22,260 మంది చికిత్స పొందుతున్నారు. తూర్పుగోదావరిలో 12 మంది, గుంటూరులో 8 మంది, కృష్ణాలో 8 మంది, అనంతపురంలో ఏడుగురు, ప్రకాశంలో నలుగురు, పశ్చిమగోదావరిలో ఐదుగురు, నెల్లూరులో ముగ్గురు, విశాఖలో ఇద్దరు, చిత్తూరులో ఒకరు, కడపలో ఒకరు, విజయనగరంలో ఒకరు కోవిడ్ వల్ల మృతిచెందారు.

జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు..

ఏపిలో కొత్తగా 3,963 కేసులు నమోదు


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/