మేడిగడ్డ వద్దన్నారు..8 యేళ్ల క్రితమే ప్రభుత్వాన్ని హెచ్చరించాం..

” ప్రాణహితను ప్రశ్నార్థకంగా మార్చోదు అని తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ 2015 ఆగస్టు 18 తేదీన వార్త సంచిక తొలి పేజీలో విశేష కథనాన్ని ప్రచురించింది. అప్పటికి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభ దశలోనే ఉంది. 2007లో ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి 17 వేల 875 కోట్ల రూపాయల(లైన్‌ ఎస్టిమెట్‌) వ్యయంతో ్రపారంభించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు తుమ్మిడిహట్టి నుండి ఎల్లంపల్లి రిజర్వాయర్‌ వరకు డిజైన్‌లు, ఫాన్లు అన్నీ పూర్తి చేసుకుంది. కానీ, 2008లో రివైజ్‌ ఎస్టిమెట్‌తో నిర్మాణ వ్యయం 38,500 కోట్ల(డిటైల్డ్‌ ఎస్టిమేట్‌)కు పెంచారు. 2014 వరకు అంతంతమ్రాతం నిధులు కేటాయించడంతో ఆశించిన మేర పనులు కాలేదు. ఆ తరువాత టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడటంతో మేడిగడ్డ నుంచి ప్రారంభించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆలోచనలు మొదలయ్యాయి. వాస్తవంగా తుమ్మిడి హట్టిని వద్దని మేడ్డిగడ్డ వద్దప్రారంభించాలని ప్రతిపాదన ముందుకు వచ్చినప్పుడు ఆనాటి టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణకు చెందిన నీటి పారుదల శాఖలో పని చేసి రిటైర్‌ అయిన ముగ్గురు చీఫ్‌ ఇంజనీర్లు, ఒక రిటైర్డ్‌ సూపరింటెండెంట్‌ ఇంజీనీర్‌, తెలంగాణ రిటైర్డ్‌ ఇంజీనీర్స్‌ అసోసియేషన్‌కు చెందిన మరొక ప్రతినిధితో కూడిన బందం ్రపభుత్వం సమర్చిన హెలిక్యప్‌ర్‌లో వెళ్లి సమ్రగ సర్వేను నిర్వహించారు. లోతైన అధ్యయనం చర్చోపచర్చల అనంతరం మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు ప్రారంభించడం సరికాదని స్పష్టమైన సూచనలతో ఒక నివేదిక ్రపభుత్వానికి అందించారు. ఒకవేళ తుమ్మిడిహట్టి వద్ద వద్దనుకుంటే కొద్దిగా కిందికి వెళ్లి పరిసరాల్లో మరోక ్రపాంతాన్ని పరిశీలించవచ్చునని ఆ నివేదికలో అభ్రిపాయపడ్డారు. అంతేకాని మేడ్డిగడ్డ వద్ద మాత్రం ప్రాజెక్టు నిర్మాణం అనుకూలం కాదని స్పష్టంగా ఆ నివేదికలో పేర్కొన్నారు. అందుకు ఎన్నో కారణాలు కూడా వెల్లడించారు. ఆ నివేదికను పట్టించుకోకుండానే కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. దీంతో నిర్మాణ వ్యయం పెరిగింది. అంతేకాదు, పెరిగిన నిర్వహణ వ్యయం ఒక్క ఏడాదే కాదు ప్రతీ ఏడాది భరించాల్సి వస్తుంది. అందువల్ల అదనంగా భారం పడుతుందని వార్త హచ్చరించింది. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు ఎంత వ్యయం చేయవలసి వస్తుందో అదే తుమ్మిడిహట్టి వద్ద నుంచి ఎల్లంపల్లి వరకు ఎంత ఖర్చు అవుతుందో అంచనా లేక్కలతో సహ వార్త వివరంగా ప్రచురించింది. మరోపక్క కోట్లాది రూపాయలు వ్యయం చేసి తుమ్మిడిహట్టి నుండి ఎల్లంపల్లి వరకు చేపట్టిన ఐదు ప్యాకేజీల్లో ఒకటి రెండు ప్యాకేజీల కొంతమేరకు అప్పటికే పనులు పూర్తయ్యా యి. పెద్దవాగుపై అక్విడేట్‌ నిర్మాణానికి అవసరమైన పిల్లర్ల పని కూడా ప్రారంభించారు. ఆ మేరకు 18 వందల కోట్ల రూపాయల వరకు బిల్లులు కాంట్రాక్టర్లకు చెల్లించారు. ఇపుడు ఆ పనులు నిరుపయోగం అయ్యాయి. తవ్విన కాల్వలు పూడిపోయే దశకు చేరుకున్నాయి. మేడిగడ్డ బ్యారేజి పిల్లర్లు కుంగడంతో ఇతర సమస్యలు కూడా ముందుకు వచ్చాయి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పై అన్ని స్థాయిల్లోనూ చర్చ జరుగుతున్నది. ఈ వ్యవహారాన్ని ఎనిమిదేళ్ల క్రితమే “పాణహిత” ను ప్రశ్నార్థకంగా మార్చొద్దు?” అనే శీర్షికతో వార్త ప్రచురించింది. ర్రాస్టంలో ఏర్పడిన నూతన ప్రభుత్వం పరిశీలించాల్సిన అంశాలు కూడా అందులో కొన్ని ఉన్నాయి. నష్ట నివారణ చర్యలు తీసుకోవడానికి ఆ వ్యసం కొంతమేరకు తోడ్పడుతుంది.

ఎడిటర్‌