విరిగిప‌డ్డ కొండ‌చ‌రియ‌లు.. 36 మంది మృతి

రాయ్‌గఢ్‌: మహారాష్ట్రలో వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీవర్షాల కారణంగా రాయగఢ్‌ జిల్లాలో మూడు చోట్ల కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌ల్లో ఇప్పటివరకు 36 మరణించగా, పలువురు గల్లంతయ్యారు. ఘటనా స్థలంలో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. శిథిలాల కింది మరికొందరు చిక్కుకున్నారని జిల్లా కలెక్టర్‌ నిధి చౌదరి చెప్పారు.

కాగా, గత రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా రాయగఢ్‌ జిల్లాలో మూడు చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో కొల్హాపూర్‌ జిల్లాలోని 47 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. 965 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మ‌హారాష్ర్ట‌లో ఒక్క జులై నెల‌లోనే ఇంత‌గా భారీ వ‌ర్షాలు కురియ‌డం 40 ఏండ్ల‌లో ఇదే తొలిసారి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/