సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం..ముగ్గురు మృతి

హైదరాబాద్ నగరంలో ఈ మధ్య వరుస అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రతి రోజు ఎక్కడో చోట అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం పలువురు మృతి చెందడం జరుగుతూనే ఉంది. తాజాగా సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంకు చెందిన గడ్డపోతారం మైలాన్ పరిశ్రమంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకోగా..ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ప్రమాద ఘటన సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. వారిలో ఒకరు పశ్చిమ బెంగాల్ కి చెందిన వ్యక్తి కాగా మరొకరు బీహార్ కి చెందినవారు. ఇక అసిస్టెంట్ మేనేజర్ మాత్రం ఏపీలోని శ్రీకాకుళంకు చెందిన వ్యక్తని తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ చెందిన పరితోష్‌ మెహతా (40), బిహార్‌ వాసి రంజిత్‌ కుమార్‌ (27) తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించగా మార్గం మధ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.