3 గంటల పర్యటనకు రూ.100 కోట్ల ఖర్చు
డొనాల్డ్ ట్రంప్ పర్యటనకు గుజరాత్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నె 24న భారత్ రానున్న నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ చేరుకొని అక్కడ మూడు గంట పాటు ట్రంప్ గడపనున్నారు. అందుకోసం విజయ్ రూపాణి సర్కార్ రూ.100 కోట్లు వెచ్చిస్తోంది. అహ్మదాబాద్ నగరపాలక సంస్థ, అహ్మదాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ సంయుక్తంగా ఈ ఖర్చును భరిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అదనంగా మరో రూ.14 కోట్లను అందించనుంది.
ఇప్పటికిప్పుడు కొత్త రోడ్లు ఏర్పాటు, పాత రోడ్ల మరమ్మత్తుv చేపట్టారు. వీటి కోసం రూ.80 కోట్లను కేటాయించగా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ట్రంప్ భద్రత కోసమే రూ.15 కోట్ల దాకా ఖర్చు చేయనున్నారు. మోడీ, ట్రంప్ రోడ్ షో వెంబడి సాంస్కృతిక కార్యక్రమాలకు అదనంగా రూ.4 కోట్లు వెచ్చిస్తున్నారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/