మునుగోడుకి ఎంత మేరకు నిధులు ఇచ్చారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలిః రాజగోపాల్‌ రెడ్డి

komatireddy-rajagopal-rekomatireddy-rajagopal-reddy-comments-on-cm-kcrddy-fires-on-revanth-reddy

హైదరాబాద్ః బిజెపి నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి సిఎం కెసిఆర్‌ పై మరోసారి విమర్శలు గుప్పించారు. సిరిసిల్ల, గజ్వేల్‌ నియోజకవర్గానికి ఎంత ఖర్చు చేశారో… మునుగోడుకి ఎంత మేరకు నిధులు ఇచ్చారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని డిమాండ్‌ చేశారు. నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించాలని శాసనసభ వేదికగా ప్రశ్నించినా… రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న పాపానపోలేదని మండిపడ్డారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి నిధులు ఇవ్వని సిఎం కెసిఆర్‌.. మునుగోడు ఎలా వస్తారని కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ప్రశ్నించారు. నిధులు కేటాయించనందుకు మునుగోడు ప్రజలకు సిఎం కెసిఆర్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అమిత్‌షా సమక్షంలో భారీగా చేరికలున్నాయని.. అందుకు భయపడే.. కెసిఆర్‌ రేపు సభ ఏర్పాటు చేసుకున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్‌ ఆరోపించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/international-news/