2024 పార్ల‌మెంట్ ఎన్నిక‌లే మా లక్ష్యం – కేటీఆర్

KTR BRS

దసరా సందర్బంగా జాతీయ పార్టీ బీఆర్ఎస్ ను ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్. దీంతో దేశ వ్యాప్తంగా కేసీఆర్ కొత్త పార్టీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ తరుణంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..2024 పార్ల‌మెంట్ ఎన్నిక‌లే మా లక్ష్యమన్నారు. మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌లో త‌మ‌కు సానుకూల అవ‌కాశాలు ఉన్నాయ‌ని పేర్కొన్నారు. క‌ర్ణాట‌క‌లో కుమార‌స్వామితోక‌లిసి పోటీ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. అధికారం, ప‌ద‌వుల కోసం కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల్లోకి వెళ్ల‌ట్లేదు.

మోడీ అండ్ కో వ్యూహాల‌న్నీ మాకు తెలుసు. వ్యూహాల‌ను ఎదుర్కొని వారి బాగోతాలు బ‌య‌ట‌పెడుతామ‌న్నారు. బీజేపీ విలువలు లేని రాజ‌కీయాలు చేస్తోంద‌ని మండిపడ్డారు. మోడీ అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను ఉప‌యోగించుకుంటారు. వేట కుక్కల్లాగా ఈడీ, ఐటీ, సీబీఐని ఉప‌యోగించుకుంటారు. ఒక్క బీజేపీ నేత‌పైనైనా ఐటీ, ఈడీ దాడులు జ‌రిగాయా? అని ప్ర‌శ్నించారు. తెలంగాణ‌లో చేసిన ప‌నిని దేశానికి చెబుతామ‌న్నారు. ఏడాదిన్న‌ర‌లో 28 రాష్ట్రాల్లో పోటీ చేస్తామ‌ని చెప్ప‌ట్లేదని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. బీఆర్ఎస్ ద్వారా అన్ని స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం చూపిస్తామ‌ని , ప్ర‌తి ఒక్క‌రికి తాగునీరు, ఉచితంగా విద్యుత్ అందిస్తామని ,ఎస్సీల‌ను వ్యాపార‌వేత్త‌ల‌ను చేస్తామని కేటీఆర్ స్పష్టం చేసారు.