19వ పాశురం:తిరుప్పావై

ఆధ్యాత్మిక చింతన

19th Pashuram: Thiruppavai
19th Pashuram: Thiruppavai

కుత్తువిళక్కెరియ క్కోట్టుక్కాల్‌ కట్టిన్మేల్‌ మెత్తైన శయనత్తిన్‌ మేలేఱి, కొత్తలర్‌ పూంగుళల్‌ నప్నిన్నై కొంగైమేల్‌ వైత్తుక్కిడన్ద మలర్‌మార్‌ పా! వాయ్తిరవాయ్!
మైత్తడం కణ్ణినాయ్! నీ ఉన్‌ మణాళనై
ఎత్తనైపోదుమ్‌ తుయిలెళ వొట్టాయ్ కాణ్‌,ఎత్తనై యేలుమ్‌ పిరివాత్త కిల్లాయాల్‌,
తత్తువమను€ తగవేలో రెమ్బావాయ్

పంతొమ్మిదవ పాట

నలుదెసల దీపములు వెలుగుచుండ
దంత నిర్మితమైన ధవళ మంచముపైన
ఎత్తైన ఒత్తైన పట్టుపరుపుపైన
శేషతల్పము పోలు శయ్యపైన
నీలలోచన హృదయాన నిదురించు స్వామి
నీల సుమ కురులతో మునిగినావేమి?
పరవశమ్మున సోలి పలుకవా ఏమి?
కల్కి! కాటుక కంట బంధింతువా ఏమి?
ఒక్క క్షణము మాధవ్ఞని వదలవా ఏమి?
సర్వజనులకు స్వామి ఐన వాని
కట్టి ఉంచుట నీకు తగదు గాని
కరుణించి, స్వామి కృప కలుగచేయుమమ్మ!
భావం: ఆ గదిలో గుత్తిదీపములు వెలుగుచున్నవి. అందులో దంతకోళ్లు గల మంచము. వేసవిలో చల్లదనము శీతాకాలములో వెచ్చదనము ఇవ్వగల, తెల్లదనము, మెత్తదనము, పరిమళము గల విశాలమైన పడక ఉన్నది. కాటుకను విశాలమైన కనులకు అలంకరించుకొన్న నీలాదేవి పడుకొని యున్నది. ఆమె స్థనములపై, విశాల వక్షము గల కృష్ణుడు తన శరీరమును ఆనించినాడు.
ఒక క్షణమైన కృష్ణుని నీ నుండి ఎడ బాటు చేయనా? అది నీ స్వభావమునకు తగదమ్మా!
అని నీలాదేవితోను, ఒక మారైనా పలకవా అని కృష్ణునితోను, వెలుపలి గోపికలు అంటున్నారు

ఫలం: పరమాత్మతత్వం.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/