వేములవాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

పాలకుర్తి సోమేశ్వరునికి మంత్రి ఎర్రబెల్లి మహాభిషేకం

ts-minister-indrakaran-reddy-presents-silk-clothes-to-vemulawada-rajanna

వేములవాడః ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం రాజరాజేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరపున ఏఈవో హరీంద్రనాథ్‌ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. కాగా, శివరాత్రి సందర్భంగా వేములవాడకు భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు.

మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ పుణ్యక్షేత్రం, స్వయంభు శ్రీ పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీ నరసింహ ఆలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు మహాభిషేకం నిర్వహించారు. ఆలయ అధికారులు, అర్చకులు వారికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య మహాభిషేకం చేశారు. అనంతరం వారికి వేదా శీర్వచనం అందించారు. స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వారితోపాటు జనగామ ఎమ్మెల్యే ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి దంపతులు కూడా ప్రత్యేక పూజలు చేశారు.